Best Small Films Of Telugu Film Industry This Year

 

To read in english click here

 
ఈ ఫ్రైడే తో ఇయర్ చివరికి కి వచ్చేసింది వచ్చేసింది. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మన తెలుగు ప్రేక్షకులు   చిన్న సినిమాలను బాగా ఆదరించారు. 2014 లో హిట్ అయిన స్వామిరారా, ప్రేమకథాచిత్రం  సినిమాలు వల్ల మన ప్రేక్షకులకు చిన్న సినిమాల మీద నమ్మకం ఫిలిం మేకర్స్ కి దైర్యం పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య అయితే చిన్న సినిమాలు పెద్ద సినిమాలకి పోటీ ఇస్తునాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. యూట్యూబ్ షార్ట్ ఫిలిం మేకర్స్ ,మన సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్స్ వల్ల ఇయర్ లో చాలా చిన్న సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి .సినిమా కి కంటెంట్ ముఖ్యం కాస్టింగ్ ఓ, బడ్జెట్ ఓ కాదు అని ప్రూవ్ చేసిన కొన్ని సినిమాలు మీకోసం.ఈ కింద సినిమాలు రిలీజ్ డేట్ ఆధారంగా ఆర్డర్ చేసినవే కానీ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు
కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి
 

Best Small Film #1 Needi naadi oke katha

వేణు ఊడుగుల తీసిన ఈ అద్భుతం ఈ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అయింది. ఒక టీచర్ అయిన తండ్రి చదువు ఇష్టం లేకపోయినా తన తండ్రి ఆనందం కోసం చదవాలనుకునే ఒక కొడుకు ల మధ్య నడిచే కథే ఈ సినిమా. ఈ సినిమా రైటింగ్ ని వర్ణించడానికి ఒక పరాగ్రఫ్ సరిపోదు మనిషికి కోపం వస్తే కొప్పడాలి ఆనందం వస్తే ఆనందపడాలి బాధ వస్తే బాధపడాలే కానీ పాజిటివ్ థింకింగ్ అని వాటిని కంట్రోల్ చేసుకుంటే మనిషి కూడా ఒక రోబో  అవుతాడు, జీవితంలో ఎవడి తాహత కు ఎవడి సంతృప్తి కు తగ్గ పని చెయ్యాలి ,కాని వాడ్ని చూసి వీడిని చూసి కాదు, సంపాదనలో ఆనందం ఉండదు మనకు నచ్చిన పనిలో ఆనందం ఉంటుంది అని చెప్పే ఈ మూడు డైలాగులు ఈ సినిమా అంటే ఏంటో చెప్తాయి.
 

Best Small Film #2 Ee nagariniki emaindi

తొట్టి గ్యాంగ్ మూవీ తర్వాత చాలారోజులకి బడ్డి కామెడీ జోనర్ లో వచ్చిన మూవీ ఈ నగరానికి ఏమైంది. తరుణ్ భాస్కర్ నెక్స్ట్ జంధ్యాల ఎటువంటి సందేహం అక్కర్లేదు అని బల్లగుద్ది చెప్పడానికి ఈ మూవీ రైటింగ్ చాలు.ఈ మూవీ కాప్షన్ లో చెప్పినట్టు “సినిమా కు మీ గాంగ్ తో రండి చూసుకుందాం”  అన్నట్టు మన ఫ్రెండ్స్ మొత్తాన్ని resemble చేసే లాగా ఉంటాయి ఈ సినిమాలో క్యారెక్టరస్. సైకో వివేక్, కౌశిక్ ఉప్పి, కార్తీక్ ఈ నలుగురు థియేటర్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు మనందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించే హంగామా అది .

Best Small Film #3 Goodachari

స్పై మూవీస్ అంటే హాలీవుడ్ మూవీసే చూడాలి అని అనుకునే మన తెలుగు ప్రేక్షకులందరికీ మన తెలుగోడు కూడా ఒక స్పై మూవీ తీయగలడు అని నిరూపించాడు .అతి తక్కువ బడ్జెట్ లో ,అతి తక్కువ టైంలో తీసిన ఈ మూవీని మన తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. క్షణం మూవీ సక్సెస్ ని ఎక్కడ తలకెక్కించుకోకుండ,  గూఢచారిని మన అడవి శేష్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై థ్రిల్లర్ గా తీశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఈ సినిమా ఏక్కడ మనకు బోర్ కొట్టించకుండా మూవీ అద్యంతం మనల్ని ఆకట్టుకుంటుంది.
 

Best Small Film #4 C/o Kancharapalem

ప్రేమ జ్ఞాపకాలు ఈ రెండు ప్రతి మనిషి జీవితంలో ఎవరు తుడిచేసిన చెరగని మధుర అనుభవాలు అలాంటి అనుభవాల కలయికే కేరాఫ్ కంచరపాలెం సినిమా విషయానికి వస్తే ఎప్పుడు కెమెరా కూడా  చూడని వాళ్లతో యాక్టింగ్ చేయించి, ఎప్పుడూ చూసే ఓవర్ రొమాంటిక్ లవ్ స్టోరీ కాకుండా ఊర్లో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథలు చూపిస్తూ వాళ్లతో ప్రేమలో పడేలా చేస్తుంది సినిమా .ఈ సినిమా దర్శకుడు ఒక కొత్త కథనంతో సరైన ఎండింగ్ తో ఆ ఊరి ప్రేమకథలు మన మన వెంటే వచ్చేలా చేశాడు, ఒక అమాయకపు స్వచ్ఛమైన ప్రేమ కథలు చూడాలనుకుంటే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి
 

Best Small Film #5 Chi la sow

రీసెంట్ గా వచ్చిన సినిమాలలో చాలా డీసెంట్ సినిమా ఇది. హీరో రాహుల్  రవీంద్రన్ మొదటి సారిగా దర్శకత్వం చేసాడు చాలా సింపుల్ గా క్లాసీగా ఉంటుంది .సినిమా సంగీతం విషయానికి వస్తే ప్రశాంత్ విహారి అదరగొట్టేశాడు. యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు .కామెడీ అండ్ ఇంకా లవ్ స్టోరీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా డీల్ చేసాడు డైరెక్టర్. హీరోయిన్ అయితే తన యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకుంది. సినిమా అయిపోయాక కూడా తను మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది .పెద్దగా బడ్జెట్ అని ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా తీశారు మూవీ అదే ఈ సినిమాకి మ్యాజిక్ లా పని చేసింది.
 
ఇవి కాకుండ  ఆ!, హుషారు, RX100 సినిమాలు కూడ ఈ ఏడాది లొ వచ్చిన మంచి సినిమాలు అని చెప్పచు.
 
 

ENGLISH VERSION

 

ee Friday tho ee year end ki vachesindhi. prathi year laagane ee year kooda mana telugu prekshakulu chinna cinemaalanu baane aadarichaaru. 2014 lo hit ayina swamy rara, prema katha chitram laanti chinna cinemaalu valla mana prekshakulukali chinna cinemalu meeda nammakam, film makers ki dhairyam peruguthu vachindhi. ee madya aithe chinna chinna cinemalu peda cinemalaki poti isthunaayi anadamlo ee matram sandeham ledu. Youtube short film makers, mana suresh productions lanti peda banners valla ee yaer lo chaala chinna cinemaalu pedda blockbusters ayyayi. Cinema ki content mukyam casting oo, budget oo kaadhu anni ee year lo proove cheskuna konni chinna cinemalu mee kosam. article lo ki vellemundu meeru banti ki subscribe avakapothe subscribe avvandi. ee kinda cinemalu release date aadaramga order chesinave kaani okati thakkuva okati ekkuva kaadhu.

Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Best Small Film #1 Needi naadi oke katha

Venu udugula theesina ee adbhutham ee year march lo release aind. Oka teacher aina thandri ,chaduvu istam lekapoina tana tandri anadam kosam chadavalanukuney oka koduku ,vela madya nadiche story ae ee cinema. Ee cinema writing ni varninchadaniki oka paragraph lo varnichalenu. Manishi kopam vaste kopadaali, aanadham vasthe aanadhapadali, baadha osthe baadha padale kaani positive thinking ani vaatine control cheskunte manishi kooda oka robo avthadu, jeevitham lo evadi taahatuku ,evadi samthrupthi ki tagga pani vadu cheyali kaani pakka vaadu adi ayyadu idi ayyadi ani kaadu, sampadana lo aandandam undadu manaku nachina panilo  anandam untundi ani cheppe ee 3 dialogues ee cinema ante ento cheptaayi.

Best Small Film #2 Ee Nagariniki Emaindi

thotti gang movie tarvaata chaala rojulaki buddy comedy genre lo vachina  movie ee nagariki ki emaindi. Tharun bhascker next jandhyala anadamlo etuvanti sandeham akarledu ani balla guddi cheppadaniki ee movie writing chaalu. movie caption lo cheppinattu “thetres ki gang tho randi chuskundham ” annatu mana friends gang mothanni resemble chesela untayi ee cinemalo characters. psycho vivek, kaushik, uppi, karthik ee naluguru theatre lo chese hungaama antha intha kaadhu manadarni potta chekaalayyela navvinche hungama adhi.

Best Small Film #3 Goodachari

Spy movies ante hollywood movies ee chudaali ani anukune mana telugu prekshakulaku andarki mana telugodu kooda oka spy movie theeyagaldu ani adivi sesh chupinchadu. athi thakkuva budget lo athi thakkuva time lo theesina ee movie mana telugu prekshakulu bramharadham pattaru. Kshanam movie success ni ekkada thalaku ekkinchukokunda adivisesh goodachari one of the best spy thriller ga teesadu. commercial elements leni ee movie atyantham manalni akattukutundhi.

Best Small Film #4 C/o Kancharapalem

prema,gnapakkalu e rendu prathi manishi jivitham lo evaru thudisesina charagani madhuranubhavalu.alanti madhuranubhvala kalayike c/o kancharapalrm.cinemma vishayaniki osthe eppudu camera kuda choodani valotho acting cheyinchi, eppudu chuse over dramatic love story kakundda oka oorilo jarige swachamaina premakathalani chupisthu valatho premalo padela chesthundhi e cinema. e movie director oka different screenplay tho correct ending tho aa oori premakathalni mana vente vachela chesadu.oka amayakapu swachchamaina premakathalani choodalanukunte e moviee ni assal miss avvakandi.
 

Best Small Film #5 Chi la sow

recent ga ochina vatilo decent cinema idi.actor rahul first time direction chesadu,chala simple ga classy ga untadi cinema.music ayithe adharagottaru.actors kuda chala baga perform chesaru.comedy and love story ematram lag lekunda deal chesadu director.heroine ayithe chimpesindi thana acting tho,movie ayipoyaka kuda thanu mana thone unnatu anipistundi,peddaga budget ani arbataalu lekunda chala simple ga untundi e cinemaki ade magic la pani chesindhi.
 
Ivi kaakunda Kajal’s Awe, Hushaaru, Rx100 cinemaalu kooda one of the best small films of this year ani cheppochu.
banti
 

Leave a Comment