Why RGV is a badass film maker ?

Why RGV is a Badass Film Maker ?

ఒక వ్యక్తి సినిమా తీస్తున్నాడు అంటే ఒక్క తెలుగు ప్రజలే కాదు యావత్ భారతదేశం వేచి చూసేది,ఇప్పుడు బ్లాక్ బస్టర్లు తీసే ప్రతి డైరెక్టర్ యొక్క మొదటి పేజీలో ఆయన ముందు మాట ఉంటుంది, ఆయనే  RGV. ఆ మూడు  అక్షరాలే అమితాబచ్చని కాపాడింది, ఆ మూడు అక్షరాలే నాగార్జున లైఫ్ ని స్టార్ట్ చేసింది, ఆ మూడు అక్షరాలు తెలుగు ఇండస్ట్రీలో కొన్ని పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా పద్ధతులను  బ్రేక్ చేసింది, సినిమా అంటే ఇలా కూడా తియ్యొచ్చు అని పాఠాలు నేర్పించింది, కొన్ని లక్షల మంది ఫిల్మ్ మేకర్స్ ని సినిమా తీయడానికి ఇన్స్పైర్ చేసింది. మన దేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది డైరెక్టర్లో RGV ఎప్పటికీ నిలిచిపోతారు. విజయవాడలో చదువు మీద ఇంట్రెస్ట్ లేని ఒక విద్యార్థి ఇండియాస్ బిగ్గెస్ట్ ఆక్టర్ అమితాబచ్చన్ తో మూవీ తీశాడు అంటే అది చిన్న విషయం కాదు ఊహించలేనంత , ఊహకందనంత పెద్ద విషయం. అందరూ అంటుంటారు RGV పడిపోయాడు, మేటర్ అయిపోయింది అని కానీ ఒకటి క్రియేటర్ కి ఎప్పుడు మరణం ఉండదు అలాగే వాళ్ళ వర్క్స్ కి  ఎప్పుడూ ఓటమి ఉండదు.

ఆర్టికల్ లోకి వెళ్లే ముందు ఆర్టికల్ పెద్దది అవుతుందని తక్కువే రాశ దీనికి వచ్చిన రెస్పాన్స్ బట్టి దీనికి పార్ట్-2 ప్లాన్ చేస్తాను.
కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to our notifications ని క్లిక్ చెయండి

RGV అంత గొప్ప డైరెక్టర్ అవ్వడానికి కారణం అతను బ్రేక్ చేసిన కొన్ని ఫిలిం మేకింగ్ రూల్స్.

ఆయన సినిమాల్లొ కత్తులు మట్లాడుతాయి,నెత్తురు సమధానాలు చెప్తాయి,పగ లు యెర్రటి మంటల విర్చుకుపడ్తాయి.steady camని ముట్టుకోడానికి భయపడుతున్న రోజుల్లో నేను దాంతో సినిమా తీస్తా అని శివ తీశాడు. మాస్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ లాంటి హీరో తో ఒక మ్యూజికల్ హిట్ క్షణక్షణం తీశాడు.నా హారర్ సినిమా ఎవరైతే ధైర్యంగా ఒక్కరే థియేటర్లో చూస్తారో వాళ్లకి ఐదు లక్షలు ఇస్తానని చెప్పాడు.డిస్ట్రిబ్యూటర్స్ & సినిమా థియేటర్ వాళ్లు అందరికి షాక్ ఇచ్చేలా ఐస్క్రీమ్ ని ఆక్షన్ లో అమ్మేశాడు. సినిమాలు అంటే పెద్ద పెద్ద కెమెరాలు కావాలి ,ఒక ఆరు నెలలు టైం పడుతుంది అని అనుకునే వాళ్ళందరికీ అది ఒక భ్రమ అని దొంగలముఠా తీశాడు.కాలేజ్ కుర్రాళ్లు అంటే హాకీ స్టిక్స్ తోనే కట్టుకోవాలి అనుకునే రోజుల్లో సైకిల్ చైన్ నీ కొత్త ఆయుధంగా చూపించాడు. సీక్వెల్స్ అంటే ఎందుకులే, మళ్లీ జనాలు ఏం వస్తారు అని అపోహ వుండే రోజుల్లో మనీ & మనీ-మనీ తీశాడు. రక్త చరిత్ర లాంటి హత్యా రాజకీయాలను ఏమాత్రం బెదరకుండా  నిజాన్ని చూపించాడు. అమీర్ ఖాన్ లాంటి పెద్ద యాక్టర్ ని రంగీలా లో defame క్యారేక్టర్ లో చూపించాడు. మ్యూజిక్ అంటే మెలోడియస్ గా ఉండడం కాదు ఆ మ్యూజిక్ మనల్ని బాధ పెట్టాలి గందరగోళం సృష్టించాలి, అని మ్యూజిక్ మేకింగ్ రూల్స్ ని బ్రేక్ చేశాడు. సినిమాలో భారీ భారీ డైలాగులు ఉండే ఆ రోజుల్లో షార్ట్ గా సింపుల్ గా కూడా డైలాగ్స్ తో మెప్పించాడు. జగపతిబాబు యాక్షన్ సినిమాలకు పనికిరాడు అంటే గాయం సినిమా తో అందరికీ  చెప్పు దెబ్బ కొట్టాడు. యాక్టర్లు అందంగా లేకపోతే సినిమాలు  జనాలు చూడరు అన్నారు, అతి తక్కువ బడ్జెట్ లో సత్య తీశాడు బాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది, చాలా మంది బాలీవుడ్ డైరెక్టర్ తమ career ని  అరచేతిలో  పట్టుకొని పరిగెత్తారు.ఆయన డైరెక్షన్  కి మాఫియా సైతం బానిస అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే RGV అలజడులు అన్ని ఇన్ని కావు.  గ్రాఫిక్స్ , హై బడ్జెట్ లెకుండ ఒక సాధారణమైన సినిమాని అద్భుతంగా ఎలా చేయాలో RGV కి  తెలిసినంత ఏవ్వరికి తెలీదు.
ఒక్క మాట గుర్తు పెట్టుకోండి ఒక డైరెక్టర్ కి సినిమా తీయడానికి నిర్మాతలు లేనప్పుడు ఆ డైరెక్టర్ పడిపోయాడు అని చెప్పొచ్చు కానీ ఆర్జీవీకి ఇంకో వంద సినిమాలకు సరిపడా నిర్మాతలు రెడీగా ఉన్నారు.

Leave a Comment