varna image

A Forgotten Masterpiece :Varna

TO READ IN TELUGU CLICK HERE

2013 lo selva raghavan ane oka tamil director theesina cinema varna,e director career lo ne e cinema pedha flop,flop anadam kanna disaster anochu varna cinema.e director theesina hit cinemalu odilesi flop cinema gurinchi enduku cheptunnanate,manchi cinema theatre lo chanipoina charithralo bathakali ane udheshamtho,alanti manchi cinemala gurinchi prekshakulu thelusukovali,tamil valaki cinemalu ela theyalo neerpina selva raghavan, varna cinema gurinchi ,ah cinema flop avvadaniki karanala gurinchi, avento telisina director nirlakshanga enduku vadilesadanna dani gurinchi e article lo chudham.

E LOKAMLO PREMA KI MATRAME AVARODHALU LENI DHARI UNTUNDI !!!

Varna cinema katha chala mandhiki artham avvaledhu ani theesiparesaru, asalu ah katha ki artham ledu ani annaru. paina cheppina dialouge cinemalo chala sarlu vinipistundi dani meaning entante ne prema nijamaithe adi ekkadaina brathukutundhi ani.Cinema katha ni artham chesukovalante e okka dialouge ni gurthupettukoni cinema chusthe chalu.rendu prapanchala madhya nadiche prema kathalu,okati bhoomi medha inkoti boomi lanti inko graham paina ,prema ane padhaniki artham kuda theliyani prapanchaniki prema ela parichayam ayyindhi,e rendu prema kathalu oka daggara kalustayi ,ala enduku kalisayi,ela kalisayi,kalavadam valla em jarigindhi anedi cinema katha.

Director selva Raghavan eppud mana samajam accept cheyani vishayalni thana cinemaloo chupistadu,alantidey bhoomi medha jarige madhubala krishna prema katha,oka ammayi thanathata thanu oka abbayini premistunna ani cheppakudadhu ani namme mana samajaniki, chepthe poedem ledu !!,manusuloni bhavalani vyaktha parachadam manshula svabhavamm kevalam mogavaaridhi matrame kaadu ani cheppadu.Alage bhoomi lanti inko graham paina jarige varna ane ammayi prema katha tho mana samajam lo prema ki moju ki theda thelikunda inka janalu ela bathukutunnaro chupinchadu.Ah graham lo mogavariki, aada varu ante banisalu matrame,vaari sukhalu therchadaniki puttina varu matrame ani anukuntuntaru,alanti samajam lo swecha tho brathakalunukune varna ane oka ammayi untundhi.evvariki banisaga brathakodhu anede ame jeevitha lakshyam,kaani chivariki thanaki thelisedentante oka ammayi mogavadiki baanisa ayithe thappu kaani vadi prema ku banisa avvtam swecha tho samanam ani.

e cinemalo chala kelakamaina vishyam entante varna unde graham lo puulu puuyavu endukante akkada prema undadhu kabatti.chala mandi puulu puyakapovadam endi adhi oka chetha comparision ani annaru kani director selva raghavan brilliant comparision ani nak anipinchindi.bhoomi medha jarige love story lo chala scenes lo varsham untundhi, director edho careless ga varshanni akkada pettaledhu ,vala prema ni varsham tho represent chesadu,alage varna unde graham lo puulu puyavu akkada eppudu varsham padadhu,varna unde graham lo okka secene lo kuda varsham undadhu,bhoomi medha varsham laga unde prema ni varna unde graham medhaku tesukupoyi akkada puulu pusela chesadu director. bhoomi medha unde veela prema ni thesukelli ah varna unde graham loni valaki prema ni parichayam chestadu ,ante varsham lanti veela prema valla akkada puulu pustayi ani director thana brilliant view ni chupinchadu.

cinema lo ni maatalo,dialouges chala fresh feel ni istayi,silent ga calm ga unde screenplay valla ah fresh love ni manam experience avthamu.Haris jayraj garu e cinemaki music icharu, anni paatalu magic laga untayi,chala melodious ga untayi.Cinematography ayithe superb asalu,kotha prapanchanni srushtinchadaniki chala kasatapaddaru,chala adbhutamaina visual untayi e cinemalo avvi matram assalu miss avvakandi.

Cinemalo quality lenattuga nak anipinchinavi graphics and action scenes,cinema chusina director ki kuda idi munde telisi kuda ala release chesaremo ani nen anukunna ,endukante e cinema oka prema katha kabatti janalu deeni prema katha ga matrame chustaru ani anukunnademo,ala chusunte cinema pedha hit ayyedi.

-banti

Telugu Version

2013  లో selva raghavan అనే ఒక తమిళ డైరెక్టర్ తీసిన సినిమా వర్ణ ,ఈ దర్శకుడు జీవితంలోనే ఇదొక పెద్ద ఫ్లాప్ సినిమా. ఈ దర్శకుడు తీసిన హిట్ సినిమాలు అన్ని వదిలేసి  ఫ్లాప్ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే మంచి సినిమా థియేటర్ లో చనిపోయిన చరిత్రలో బతకాలి అనే ఉద్దేశంతో ,అలాంటి మంచి సినిమాల గురించి ప్రేక్షకులు తెలుసుకోవాలి, తమిళ వాళ్ళకి సినిమాలు ఎలా తీయాలో నేర్పిన selva raghavan  యొక్క వర్ణ సినిమా గురించి ,ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు గురించి, అవేంటో తెలిసిన దర్శకుడు నిర్లక్ష్యం గా ఎందుకు వదిలేసాడు అన్న దాని గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
 
ఈ లోకంలో  ప్రేమ కి మాత్రమే అవరోధాలు లేని దారి ఉంటుంది !!! 
 
వర్ణ సినిమా  కథ చాలా మందికి అర్థం అవ్వలేదు అని తీసిపారేశారు, అసలు ఆ కథకి అర్థం లేదని అన్నారు .పైన చెప్పిన డైలాగ్ సినిమాలో చాలా సార్లు వినిపిస్తుంది అని, దాని  అర్థం ఏంటంటే నీ ప్రేమ నిజమైతే అది ఎక్కడైనా బ్రతుకుతుంది . సినిమా కథని అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకుని సినిమా చూస్తే చాలు. రెండు ప్రపంచాల మధ్య నడిచే ప్రేమ కథలు, ఒకటి భూమి మీద ఉంటే ఇంకొకటి భూమి లాంటి ఇంకొ గ్రహం పైన ఉంటుంది. ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలియని ప్రపంచానికి ప్రేమ ఎలా పరిచయం అయ్యింది, ఈ రెండు ప్రేమకథలకు ఒక దగ్గర కలుస్తాయి, అలా ఎందుకు కలిసాయి ,ఎలా కలిశాయి ,కలవడం వల్ల ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ.
 
డైరెక్టర్ సెల్వరాఘవన్ ఎప్పుడు మన సమాజం అంగీకరించని విషయాలని తన సినిమాలో చూపిస్తాడు, అలాంటిదే భూమి మీద జరిగే మధుబాల కృష్ణ ప్రేమ కథ, ఒక అమ్మాయి తనంతట తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పకూడదు అని నమ్మె ,మన సమాజానికి చెప్తే పోయేదేం లేదు !! మనసులోని  భావాలని వ్యక్తపరచడం మనుషుల స్వభావం ,కేవలం మగవారిదే మాత్రమే కాదు అని చెప్పాడు. అలాగే భూమి లాంటి ఇంకో గ్రహం పైన జరిగే వర్ణ అనే అమ్మాయి ప్రేమ కథతో మన సమాజంలో ప్రేమకి ,మోజు కి తేడా తెలియకుండా ఇంకా జనాలు ఎలా బతుకుతున్నారో చూపించాడు .ఆ గ్రహం లో మగ వారికి, ఆడవారు అంటే బానిసలు మాత్రమే, వారి సుఖాలు తీర్చడానికి పుట్టిన వారు మాత్రమే అని అనుకుంటుంటారు. అలాంటి సమాజం లో  స్వేచ్ఛతో  బ్రతకాలనుకునే వర్ణ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరికీ బానిసగా  బ్రతకకూడదు అనేది ఆమె జీవిత లక్ష్యం,  కానీ చివరికి తనకి తెలిసింది ఏందంటే ఒక అమ్మాయి మగవాడికి బానిస అయితే తప్పు కానీ వాడి ప్రేమకు బానిస అవ్వటం స్వేచ్ఛ తో సమానం అని.
 
ఈ సినిమాలో చాలా కీలకమైన విషయం ఎంటంటే వర్ణ ఉండే గ్రహంలో పూలు పూయవు ఎందుకంటే ,అక్కడ  ప్రేమ ఉండదు కాబట్టి. చాలామంది పూలు పూయకపోవడం ఏంటి అదొక చెత్త కంపారిజన్ అని అన్నారు , కానీ దర్శకుడు సెల్వరాఘవన్ యొక్క బ్రిల్లియంట్ కంపారిజన్ అని నాకు అనిపించింది .భూమి మీద జరిగే ప్రేమ కథలో చాలా సన్నివేశాల్లో వర్షం ఉంటుంది ఏదో తెలిక ఆ వర్షాన్ని అక్కడ పెట్టలేదు దర్శకుడు, వాళ్ల ప్రేమని వర్షంతో వర్ణించాడు, అలాగే వర్ణ ఉండే గ్రహంలో  పువ్వులు పూయవు అక్కడ ఎప్పుడు వర్షం పడదు, వర్ణ ఉండే గ్రహంలో ఒక్క సన్నివేశంలో కూడా వర్షం ఉండదు. భూమి మీద వర్షం లాగా ఉండే ప్రేమని వర్ణ ఉండే గ్రహం మీదకు తీసుకు పోయి అక్కడ పూలు పూసేలా చేశాడు దర్శకుడు. భూమి మీద ఉండే వీళ్ళ ప్రేమని తీసుకెళ్లి అక్కడ వర్ణ ఉండే గ్రహంలోని వాళ్లకి ప్రేమని పరిచయం చేస్తాడు, అంటే వర్షం లాంటి వీళ్ళ  ప్రేమ వల్ల అక్కడ పువ్వులు పూస్తాయి అని దర్శకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 
 
సినిమాలో మాటలు, డైలాగులు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తాయి. సైలెంట్ గా చాలా  కామ్ గా ఉండే స్క్రీన్ ప్లే వల్ల ఆ స్వచ్చమైన ప్రేమని మనం కూడా  ఎక్స్పీరియన్స్ అవుతాము. సంగీతం విషయానికి వస్తే హారిస్ జయరాజ్ గారు అన్ని పాటలు మ్యాజిక్ లా ఉంటాయి .చాలా melodies గా ఉంటాయి .సినిమాటోగ్రఫీ అయితే చాలా అద్భుతం ,కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి చాలా కష్టపడ్డారు ,చాలా అద్భుతమైన విజువల్స్ ఉంటాయి ఈ సినిమాలో ,వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
 
 సినిమాలో క్వాలిటీ లేనట్టుగా నాకు అనిపించినవి గ్రాఫిక్స్ & యాక్షన్ సీన్స్. సినిమా చూసిన దర్శకుడికి కూడా ఇవి ముందే తెలిసి ఉండొచ్చు అయినా అలా రిలీజ్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ,ఈ సినిమా ఒక ప్రేమ కథ కాబట్టి జనాలు దీని ప్రేమకథగా మాత్రమే చూస్తారు అని అనుకున్నాడో ఏమో .అలా జనాలు ఒకవేళ చూసుంటె సినిమా పెద్ద హిట్ అయ్యేది .
 
-banti
 

1 thought on “A Forgotten Masterpiece :Varna”

Leave a Comment